News January 22, 2025

టెన్త్ ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: డిఈవో

image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గెజిటెడ్ హెచ్ఎమ్స్ అసోసియేషన్ సంఘం డైరీని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆవిష్కరించారు. అనంతరం డిఈవో మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంజీవరావు, హెచ్ఎమ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News December 10, 2025

అన్‌క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

image

బ్యాంకుల్లో ₹78,000Cr అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్‌లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.

News December 10, 2025

జిల్లావ్యాప్తంగా 620 వార్డులు ఏకగ్రీవం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 260 పంచాయతీల్లోని 2,268 వార్డులకు గాను 620 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,648 వార్డులలో మూడు విడతలలో నిర్వహించనున్న ఎన్నికలలో 4,300 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తుది విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 12 మండలాలలో వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కలిపి 5,160 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలినట్లు అధికారులు వెల్లడించారు.

News December 10, 2025

ఉప్పల్‌లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

image

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.