News March 21, 2025
టెన్త్ విద్యార్థులతో జూమ్ కాల్ మాట్లాడిన కలెక్టర్

పదో తరగతి పరీక్షలు రాయబోతున్న పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. సమయాన్ని సరిగ్గా వినియోగించుకొని ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నారు.
Similar News
News December 1, 2025
ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
News December 1, 2025
శ్రీకాకుళం: ‘దిత్వా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి’

దిత్వా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి భారీ ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు.
News December 1, 2025
GNT: విడదల రజిని చూపు ఎటువైపు..?

మాజీ మంత్రి విడదల రజిని వైసీపీతో బంధం సడలిస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పెంచుతోంది. గుంటూరు పశ్చిమ ఓటమి అనంతరం చిలకలూరిపేటలో చురుగ్గా ఉన్న ఆమెను రేపల్లెకు వెళ్లమన్న పార్టీ అధినేత ఆదేశం అసంతృప్తికి కారణమైనట్లు టాక్. దీంతో ఆమె త్వరలో పార్టీ మారే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.


