News January 30, 2025
టెన్త్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలి: డీఈవో

జిన్నారం మండలంలోని పాఠశాలలను డీఈవో వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. గడ్డపోతారం మున్సిపాలిటీలోని కాజిపల్లి, వావిలాల ఉన్నత పాఠశాలతో పాటు, జిన్నారంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. రానున్న టెన్త్ పరీక్షలకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని సూచించారు.
Similar News
News October 25, 2025
సంగారెడ్డి: ఇంటర్ సిలబస్‌లో మార్పులు

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ సిలబస్‌లోనూ మార్పులు చేశారు. ఫస్ట్ ఇయర్ ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. 20 ఇంటర్నల్, 80 ఎక్స్టర్నల్ పరీక్షల మార్కులు ఉన్నాయి. 12 ఏళ్ల తర్వాత సైన్స్ కోర్సు సిలబస్‌లో ఇంటర్ బోర్డు మార్పు చేసింది.
News October 25, 2025
జగిత్యాల కలెక్టరేట్ గేటు ఎదుట వంట సామగ్రితో నిరసన

తమ ఇంటికి వెళ్లే ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసుకుని దారి గుండా వెళ్లనివ్వడం లేదని, అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని జగిత్యాల కలెక్టరేట్ గేటు ఎదుట వంట సామగ్రితో నిరసన వ్యక్తం చేశారు. వెల్గటూర్ (M) జగదేవ్ పేటకు చెందిన నూకల దీవెన కుటుంబసభ్యులు వంట సామగ్రితో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు తమ సమస్యను వివరించారు.
News October 25, 2025
నేరం చేస్తే శిక్ష తప్పదు: జగిత్యాల ఎస్పీ

ఈ సంవత్సరం (జనవరి–అక్టోబర్) కాలంలో జిల్లాలో 83 కేసుల్లో 92 మంది నేరస్తులకు కోర్టులు జైలు శిక్షలు, జరిమానాలు విధించాయి. హత్య కేసులో 20 మందికి జీవిత ఖైదు, ఇతర కేసుల్లో 5–20 ఏళ్ల వరకు శిక్షలు విధించబడ్డాయి. నేరస్తులు ఎవరూ శిక్ష తప్పించుకోలేరని, పోలీసు–ప్రాసిక్యూషన్ సమన్వయంతో పటిష్ఠమైన విచారణ జరిపి న్యాయ నిరూపణ సాధిస్తున్నామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.


