News January 30, 2025

టెన్త్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలి: డీఈవో

image

జిన్నారం మండలంలోని పాఠశాలలను డీఈవో వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. గడ్డపోతారం మున్సిపాలిటీలోని కాజిపల్లి, వావిలాల ఉన్నత పాఠశాలతో పాటు, జిన్నారంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. రానున్న టెన్త్ పరీక్షలకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని సూచించారు.

Similar News

News February 20, 2025

పటిష్ఠ చర్యలు చేపట్టండి: నగర మేయర్

image

వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్, ఫిల్టర్ బెడ్లను మేయర్ సందర్శించి నీటి నిల్వల తీరు, ఫిల్టర్ బెడ్ పరికరాలను పరిశీలించారు. నగర వాసులకు తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.

News February 20, 2025

జెలెన్‌స్కీ ఓ నియంత: ట్రంప్

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘ఉక్రెయిన్‌లో ఎన్నికల్ని నిర్వహించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారు. స్వదేశంలో ఆయనకు ప్రజాదరణ అంతంతమాత్రంగానే ఉంది. అందుకే ఎన్నికల్ని కూడా జరగనివ్వడం లేదు’ అని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్ట్ పెట్టారు. 2019లో అధ్యక్షుడిగా ఎన్నికైన జెలెన్‌స్కీ పదవీకాలం ముగిసిపోయినా యుద్ధం పేరు చెప్పి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

News February 20, 2025

ఇసుక సరఫరాపై నిఘా పెంచాలి: ఇలా త్రిపాఠి 

image

వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్‌ల నుంచి సరఫరా చేసే ఇసుకపై పూర్తి నిఘా ఉంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మైనింగ్, తదితర శాఖల అధికారులతో కలిసి శాలిగౌరారం మండలం, వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్‌ల వద్ద ఇసుక తవ్వే ప్రాంతాలను తనిఖీ చేశారు.

error: Content is protected !!