News March 21, 2025
టెన్త్ విద్యార్థుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు: డీఈఓ

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకునేందుకు కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగిందని డిఈఓ రేణుకా దేవి తెలిపారు. విద్యార్థులకు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం 08416 235245 నంబర్ను సంప్రదించాలన్నారు. 9 గంటలలోగా పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలని 5 నిమిషాలు అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని చెప్పారు.
Similar News
News November 25, 2025
ఫార్మా బస్సులకు గాజువాకలోకి నో ఎంట్రీ

గాజువాకలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా కంపెనీ బస్సులు అధిక సంఖ్యలో సిటీలోకి రావడంతో సమస్య అధికమైందని, వాటిని నేటి నుంచి అనుమతించబోమన్నారు. ఇప్పటికే యజమానులు, డ్రైవర్లకు సమాచారమిచ్చామన్నారు. గాజువాకకు రెండు కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ జంక్షన్ వరకు మాత్రమే ఫార్మా బస్సులకు అనుమతి ఉంటుందని వివరించారు
News November 25, 2025
జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు

నల్గొండ జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు వచ్చాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. డిప్యూటీ సీఎం విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల చీరలను పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు. చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.
News November 25, 2025
26న BRS సన్నాహక సమావేశం: జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈనెల 29న నిర్వహించనున్న ‘దీక్షా దివస్’ను విజయవంతం చేయడానికి నిజామాబాద్లో ఈ నెల 26న సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 ఒక మైలురాయి లాంటిదని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని ఆయన గుర్తు చేశారు.


