News December 15, 2024
టెన్షన్.. టెన్షన్.. పులి ఎక్కడ?

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బురదకోట రిజర్వ్‌ఫారెస్ట్‌లో కనిపించిన పులి జాడ ఇంకా లభ్యం కాలేదు. అధికారులు వారం రోజులుగా ట్రాప్ కెమెరాల ద్వారా గాలింపు చేస్తున్నా ఎక్కడా చిక్కలేదు. దీంతో పులి వేరే ప్రాంతానికి తరలి వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమీప ఏజెన్సీ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పులి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని అటవీశాఖ సిబ్బంది ప్రజలకు కోరారు.
Similar News
News February 28, 2026
ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ: ఎంపీ

మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (సెర్వికల్ క్యాన్సర్) నివారణకు ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. బాలికలు, యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ ముప్పును ముందస్తుగా అరికట్టేందుకు తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని ఆమె కోరారు.

News February 27, 2026
తూ.గో: కల్తీ పాల ఘటనపై హెల్త్ బులెటిన్ విడుదల

కల్తీ పాల ఘటనలో రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న 15 మందిలో 11 మంది బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నలుగురు రోగుల పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వెల్లడించింది. కాగా 11 మంది రోగులకు ఇప్పటికీ వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ ఘటనలో 5గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.