News March 25, 2025

టేకుమట్ల: ఘోర రోడ్డు ప్రమాదం (UPDATE)

image

టేకుమట్ల మండలంలోని రామకృష్ణాపూర్(టి) సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో వరి పొలంలో పనికి సిద్ధమవుతున్న కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ క్రమంలో మోకిడి సంధ్య (30), పూలమ్మ (51) అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో ప్రేమానురాగాలు పంచే తల్లులు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి పిల్లల రోదనలు మిన్నంటాయి. 

Similar News

News October 22, 2025

వరంగల్‌లో నకిలీ ఏసీబీ మోసం

image

గుర్తు తెలియని వ్యక్తులు ఏసీబీ అధికారులమని చెప్పి ఆర్టీఏ ఎంవీఐల నుంచి దశల వారీగా రూ.10.20 లక్షలు కాజేశారు. ఫోన్లలో నకిలీ బెదిరింపులు చేయడంతో ఓ ఎంవీఐకు అనుమానం రావడంతో వెంటనే WGL ఏసీబీ డీఎస్సీ సాంబయ్యను ఆశ్రయించారు. దీంతో నిజం తెలిసింది. ఆర్టీఏ అధికారులు మోసపోయిన వివరాలు గుట్టుగా ఉంచాలని ప్రయత్నించగా, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను వెతికే పనిలో పడ్డారు.

News October 22, 2025

ములుగు: మహా జాతరకు ఇంకా 98 రోజులే !

image

మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు ఇంకా 98 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జాతర సమయం దగ్గర పడుతుండగా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గద్దెల విస్తరణ పనులు తప్ప ఇతర పనులు ఇంకా మొదలు కాకపోవడంతో సర్వత్ర ఆందోళన నెలకొంది. జాతర సమయానికి పనులు పూర్తవుతాయా ?, ప్రతి జాతరలా హడావిడి పనులు చేసి చేతులు దులుపుకుంటారా ? అని భక్తులు అనుమానవం వ్యక్తం చేస్తున్నారు.

News October 22, 2025

జీకే వీధి: డోలి మోతలోనే యువతి మృతి

image

జీకే వీధి (M) నేలపాడులో సుమిత్ర (22) మంగళవారం కాఫీ తోటకు వెళుతూ మార్గ మధ్యలో స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన గ్రామస్థులు ఆమెను డోలి కట్టి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. తమ గ్రామానికి రోడ్డు సదుపాయం ఉంటే తమ బిడ్డ బతికేదని, డోలిలో తీసుకెళ్లడం వల్ల వైద్యం సకాలంలో అందక మృతి చెందిందని కుటుంబీకులు వాపోయారు.