News March 19, 2025
టేకుమట్ల: రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత

టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన సొల్లేటి రాములు ప్రమాదవశాత్తు గతేడాది వాగులో పడి మృతి చెందాడు. కాగా పోస్ట్ ఆఫీసులో ప్రమాద బీమా చేయించుకున్న రాములు కుటుంబ సభ్యులకు మంగళవారం పోస్టల్ సూపరింటెండెంట్ హనుమంతు, రామకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ శైలజ, ఎంపీడీవో అనిత, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీశ్ చేతుల మీదుగా రూ.10 లక్షల బీమా చెక్కును అందజేశారు. బీమాతో కుటుంబం ధీమాగా ఉంటుందన్నారు.
Similar News
News November 27, 2025
నెల్లూరు జిల్లాకు మరోసారి భారీ వర్షం..!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 29, 30 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిన నేపథ్యంలో ఈ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News November 27, 2025
జనగామ: బాల్య వివాహ నిర్మూలనకు ప్రత్యేక ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

జనగామ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వందరోజుల “చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణ, భారత్” కార్యక్రమంలో జనగామ జిల్లా పరిపాలన కీలక నిర్ణయాలు చేపట్టింది. బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించిన ప్రత్యేక ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటి నివారణకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు.
News November 27, 2025
NRPT: ఎన్నికల సమాచారం కోసం ‘Te-Poll’ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారాన్ని ఓటర్లకు అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్ సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె కోరారు.


