News March 26, 2025
టేకులపల్లిలో వడదెబ్బకు రైతు మృతి

వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మద్రాస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో గల కొండంగుల బోడుకి చెందిన కేలోతు గోబ్రియా అనే రైతు వడదెబ్బతో మృతి చెందారు. ఆయన సోమవారం తన పొలంలో పండించిన కూరగాయలు, నువ్వులు కోయడానికి వెళ్లి ఎండ దెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద మృతి చెందాడు.
Similar News
News September 18, 2025
జూబ్లీ అభయం: ఒకరికి CM.. మరొకరికి పీసీసీ..!

జూబ్లీహిల్స్ టికెట్ కేటాయింపులో కొత్త రాజకీయం బయటకు వస్తుందని గాంధీభవన్‌లో చర్చ నడుస్తోంది. మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ అనూహ్యంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం వెనక పీసీసీ వర్గం ఉన్నట్లు అంచనా. అంజన్‌కు టికెట్ ఇప్పించేందుకు పీసీసీ సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడి నుంచి నవీన్ కుమార్ లేదా దానం నాగేందర్‌కు మద్దతుగా ఉన్నట్లు టాక్.
News September 18, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 18, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.33 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.16 గంటలకు
✒ ఇష: రాత్రి 7.28 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 18, 2025
నిరంతరాయ శ్రమతోనే మంచి ఫలితాలు సాధ్యం: కలెక్టర్

కరీంనగర్లో పోలీస్, అటవీ శాఖ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న పెద్దపల్లి జిల్లా అభ్యర్థులను కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం కలిశారు. అభ్యర్థులకు అందుతున్న శిక్షణ, వసతులపై సమాచారం తెలుసుకున్నారు. నిరంతర శ్రమతోనే మంచి ఫలితాలు సాధ్యమని, ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో ఫోకస్‌గా ముందుకు సాగాలని సూచించారు. అగ్నివీర్ అభ్యర్థులను కూడా ఈ సందర్భంగా కలెక్టర్ ఉత్సాహపరిచారు. శిక్షణాధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.