News March 26, 2025
టేకులపల్లిలో వడదెబ్బకు రైతు మృతి

వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మద్రాస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో గల కొండంగుల బోడుకి చెందిన కేలోతు గోబ్రియా అనే రైతు వడదెబ్బతో మృతి చెందారు. ఆయన సోమవారం తన పొలంలో పండించిన కూరగాయలు, నువ్వులు కోయడానికి వెళ్లి ఎండ దెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద మృతి చెందాడు.
Similar News
News April 24, 2025
సింగరేణి.. వారికి 50% జీతంతో స్పెషల్ లీవ్స్

TG: తీవ్ర కాలేయ వ్యాధి(లివర్ సిరోసిస్) బారిన పడిన కార్మికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. 50 శాతం వేతనంతో కూడి ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వారు కోలుకునే వరకు ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు గుండె జబ్బు, టీబీ, క్యాన్సర్, కుష్టు, పక్షవాతం, ఎయిడ్స్, మూత్రకోశ, మెదడు వ్యాధులకు ఇలాంటి సదుపాయం ఉండగా కాలేయ వ్యాధులకూ విస్తరించారు.
News April 24, 2025
ఏ సబ్జెక్టులో ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే!

కర్నూలు జిల్లాలో 31,185 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 9,601 మంది ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో 2,598 మంది, హిందీలో 292, ఇంగ్లీష్‌లో 4,660, మ్యాథ్స్ 7,781, సైన్స్ 6,900, సోషల్‌లో 4,497 మంది ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇక తెలుగులో 91 మంది, హిందీలో 15, ఇంగ్లీష్‌లో 1, మ్యాథ్స్ 22, సైన్స్ 21, సోషల్‌లో 15 మంది 100/100 మార్కులు సాధించారని వివరించారు.
News April 24, 2025
నేటి నుంచి అప్పన్న నిజరూప దర్శన టికెట్లు

సింహాచలంలో ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు టికెట్ల(రూ.300, రూ.1,000) విక్రయాలు ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. ఆన్‌లైన్‌లో www.aptemples.ap.gov.in ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో సింహాచలం పాత పీఆర్వో ఆఫీస్, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంకులో అందుబాటులో ఉంటాయి.