News March 20, 2025

టేకులపల్లి: బాలికపై అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

image

టేకులపల్లి మండలం సంపత్ నగర్ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల హాస్టల్ డిప్యూటీ వార్డెన్ ప్రతాప్ సింగ్ మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యులు, యువకులు దేహశుద్ధి చేశారు. అనంతరం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు.

Similar News

News November 24, 2025

ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

image

TG: హైదరాబాద్ శామీర్‌పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.

News November 24, 2025

పార్వతీపురం: స్నేహితుడి పెళ్లి కోసం వచ్చి.. విగత జీవివులుగా మారారు

image

జంఝావతి రబ్బర్ డాంలో మగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసింది. కొమరాడ (M) సివినిలో ఆదివారం జరిగిన స్నేహితుడి పెళ్లి కోసం హైదరాబాదు నుంచి ప్రతాప్ వచ్చాడు. గ్రామంలో ఉన్న మరికొందరి స్నేహితులతో కలిసి మధ్యాహ్నం జంఝావతి రబ్బర్ డాంను సందర్శించేందుకు వెళ్లారు. అక్కడ స్నానాలు చేసేందుకు శరత్ కుమార్, ప్రతాప్, గోవింద నాయుడు దిగి ఊబిలో కూరుకుపోయి మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

News November 24, 2025

ఖమ్మం: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు పూర్తి

image

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో 571 గ్రామపంచాయతీలకు 5,214 పోలింగ్ స్టేషన్‌లు, 6,258 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఎన్నికల విధులకు సుమారు14,092మంది సిబ్బంది అవసరమని గుర్తించి, శిక్షణ పూర్తి చేశారు. వీరిలో పోలీంగ్ ఆఫీసర్లు 6,258, ఓపీవోలు 7,834 మందిని నియమించారు.