News March 20, 2025

టేకులపల్లి: బాలికపై అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

image

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం సంపత్ నగర్ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల హాస్టల్ డిప్యూటీ వార్డెన్ ప్రతాప్ సింగ్ మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యులు, యువకులు దేహశుద్ధి చేశారు. అనంతరం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు.

Similar News

News April 24, 2025

ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

image

ఖమ్మం జిల్లాలో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెనుబల్లిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు నేలకొండపల్లి, ఎర్రుపాలెం 42.9, ఖమ్మం(U), మధిర (సిరిపురం) 42.8, వైరా, ముదిగొండ (పమ్మి) 42.7, చింతకాని 42.6, కూసుమంచి, రఘునాథపాలెం 42.5, ఖమ్మం (R) పల్లెగూడెం 42.4, సత్తుపల్లి 42.2, తిరుమలాయపాలెం 41.8, వేంసూరు, ఏన్కూరు 41.4, కామేపల్లి (లింగాల) 41.0 నమోదైంది.

News April 24, 2025

ఖమ్మం: పంట బీమా పథకంపై మంత్రి తుమ్మల సమావేశం

image

పంట బీమా పథకం అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం, యాసంగి కాలాల్లో ఏయే పంటలకు ఏయే విపత్తుల కింద బీమా వర్తింపచేయాలనే అంశంపై అధికారులతో చర్చిస్తున్నారు. ప్రధాన పంటలకు బీమా ప్రీమియం అంచనా వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పంట బీమా పథకంలో భాగంగా రైతులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.

News April 24, 2025

KMM: తాగునీటికి ఇబ్బందులు రావొద్దు: కలెక్టర్

image

వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా పటిష్ఠ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో వేసవి కాలంలో తాగునీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణంపై అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవి కాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

error: Content is protected !!