News August 23, 2024
టేక్మాల్: తల్లి మృతిని తట్టుకోలేక కూతురి సూసైడ్
తల్లి మృతిని తట్టుకోలేక కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన టేక్మాల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పాపన్నపేట ASI సంగన్న వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్నకూతురు(14) 8వ తరగది చదుతోంది. కాగా, 9నెలల క్రితం తల్లి అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి తల్లిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుండేది. బుధవారం మనస్తాపానికి గురై ఉరేసుకుంది. గురువారం తండ్రి ఫిర్యాదులో కేసు నమోదైంది.
Similar News
News September 8, 2024
అయోధ్య రాముడికి పటాన్‌చెరు నుంచి ధనస్సు, బాణం
పటాన్‌చెరు నియోజకవర్గం ఎల్‌ఐజీలోని దత్త పీఠంలో అయోధ్య రాముడికి బహుకరించేందుకు 13కిలోల వెండి, కిలో బంగారంతో తయారు చేసిన ధనస్సు, బాణానికి ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాత చల్లా శ్రీనివాసశాస్త్రీ దీనిని తయారు చేయించారు. ఈ సందర్భంగా దాతను ఎంపీ అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో మరోసారి రామరాజ్య స్థాపనకోసం కృషి జరుగుతోందన్నారు.
News September 8, 2024
కాంగ్రెస్ పాలనలో 475 మంది రైతుల ఆత్మహత్య: హరీష్ రావు
కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. అందరికీ రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పారని, కాని రైతులు రుణమాఫీ కాక తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోకపోవడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
News September 8, 2024
సంగారెడ్డి: 10న న్యాస్ సన్నాహక పరీక్ష
సంగారెడ్డి జిల్లాలోని 3, 6, 9 తరగతుల విద్యార్థులకు ఈనెల 10న న్యాస్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు ఇప్పటికే పాఠశాలలకు పంపించినట్లు చెప్పారు. విద్యార్థులకు న్యాస్ పరీక్ష నిర్వహించి జవాబు పత్రాలు మళ్లీ మండల విద్యాధికారి కార్యాలయానికి పంపించాలని సూచించారు.