News September 17, 2024
టేక్మాల్: మోడీ చిత్రపటానికి శాలువా కప్పి విషెష్

టేక్మాల్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు డాకప్పగారి నవీన్ గుప్తా, బీజేపీ జిల్లా మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికా అశోక్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి శాలువా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అశోక్, కొయిలకొండ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 12, 2025
ప్రచారం ముగిసింది.. ప్రలోభం మిగిలింది !

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక ఓటర్లను ప్రభావితం చేయడం మిగిలింది. మెదక్ నియోజకవర్గంలో మెదక్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం చేశారు.
News December 12, 2025
మెదక్: రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్, 163 BNSS అమల్లో ఉంటాయని చెప్పారు. ర్యాలీలు, ప్రచారం, గుమిగూడడం పూర్తిగా నిషేధం. ఎన్నికలు శాంతియుతంగా జరుగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
News December 12, 2025
మెదక్లో ప్రశాంతంగా తొలి విడత పోలింగ్ పూర్తి

మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రెండో, మూడో విడతల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసిన సిబ్బందికి, ముఖ్యంగా పెద్ద ఎత్తున పాల్గొన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముందు విడతల మాదిరిగానే 14, 17 తేదీల పోలింగ్ను నిర్వహించేందుకు అధికారులను కలెక్టర్ సూచించారు.


