News February 18, 2025
టైరు పేలి టాటా ఏస్ బోల్తా

వెల్దుర్తి మండల సమీపంలోని అల్లుగుండు పెట్రోల్ బంక్ దగ్గర నేషనల్ హైవేపై మంగళవారం టైరు పేలి టాటా ఏస్ బోల్తా పడింది. కర్నూలు మార్కెట్‌కు వేరుశనగ కాయలు తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారని పేర్కొన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News March 28, 2025
2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు

ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలంలో 800 సీసీ కెమెరాలు, 3 డ్రోన్లతో పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో ఆరుగురు DSPలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలు, 1,500 సివిల్ పోలీస్ సిబ్బంది, 200 మంది ఆర్మ్‌డ్, 200 మంది APSP, 100 మంది స్పెషల్ పార్టీ మొత్తంగా 2 వేలకు పైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 31 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.
News March 28, 2025
విద్యార్థులకు ప్రతి గంటకు వాటర్ బెల్: డీఈవో

పత్తికొండ రెవెన్యూ డివిజన్‌లో పాఠశాలల విద్యార్థులకు ప్రతి గంటకు వాటర్ బెల్ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ యాజమాన్యాన్ని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఎండవేడిమికి గురికాకుండా శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూడాలని అన్నారు. ప్రతి విద్యార్థి తగినంత మంచినీటిని తాగేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.
News March 27, 2025
జడ్పీ కోఆప్షన్ మెంబర్‌గా మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్

కర్నూలు జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్‌గా వైసీపీ నేత మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం కర్నూలులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్‌తో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి పీ.రంజిత్ బాషా ప్రమాణ స్వీకారం చేయించారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.