News September 1, 2024

టోర్నమెంట్‌ నిర్వహణ గొప్ప అవకాశం: మాంఛో ఫెర్రర్‌

image

అనంతపురం జిల్లాలో దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించడం గొప్ప అవకాశం అని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) త్రీమెన్‌ కమిటీ సభ్యుడు మాంఛో ఫెర్రర్‌ అన్నారు. శనివారం ఆయన టికెట్ల పంపిణీతో పాటు స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాంఛో ఫెర్రర్‌ మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్ ప్రేమికులకు ఇదొక అరుదైన అనుభూతినిచ్చే వేడుకని, జాతీయ క్రీడాకారులకు అత్యంత కీలకమైనదని అన్నారు.

Similar News

News November 13, 2025

భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్టు: సీఐ

image

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో భార్య రత్నమ్మపై హత్యాయత్నం చేసిన ఆమె <<18270800>>భర్త<<>> ఎర్రి స్వామిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఎర్రి స్వామి కత్తితో రత్నమ్మ గొంతు కోయడానికి యత్నించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు రూరల్ సీఐ హరినాథ్ తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News November 12, 2025

గుత్తిలో వ్యక్తి మృతి

image

గుత్తిలోని కర్నూల్ రోడ్డులో నిరుపయోగంగా ఉన్న హాస్టల్ ఆవరణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 12, 2025

శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలి: ఎస్పీ

image

శాంత్రిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీలేకుండా పనిచేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కేసుల ఛేదనకు టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులపై అలసత్వం వహించకుండా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు.