News March 13, 2025

ట్యాంక్ పైనుంచి దూకి యువకుడి సూసైడ్

image

సంజామల మండలం ఎగ్గోనిలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుంచి దూకి యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ముద్దనూరు మండలం ఉప్పలూరుకు చెందిన కర్నాటి హర్షవర్ధన్ రెడ్డి(30) ఎగ్గోనిలోని తన సోదరి ఇంటికి 2 రోజుల క్రితం వచ్చాడు. అయితే మద్యానికి బానిసగా మారి, ఆరోగ్యం చెడిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 6, 2025

కర్నూలు కలెక్టర్ నేతృత్వంలో పంటపై సమీక్ష.!

image

కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి వివిధ పంటల మార్కెటింగ్‌పై ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయమైన ధర లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, వ్యవసాయ అధికారులతోపాటు అనుబంధ శాఖల అధికారులు ఉన్నారు.

News December 6, 2025

విశాఖలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంఖుస్థాపన

image

విశాఖ తూర్పు నియోజకవర్గం ముడసర్లోవలో రూ.62 కోట్లతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు ఎంపీ శ్రీభరత్, విప్ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి శంఖుస్థాపన చేశారు. రాష్ట్రానికి మంజూరైన 5 హాస్టళ్లలో 3 విశాఖకే దక్కడం విశేషం. సీఎం చంద్రబాబు కృషి, కేంద్ర నిధుల సద్వినియోగంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని విప్ చిరంజీవిరావు తెలిపారు. ఈ ఐదంతస్తుల భవనం ఉద్యోగినులకు సురక్షిత వసతిని అందిస్తుందన్నారు.

News December 6, 2025

ECIL హైదరాబాద్‌లో ఉద్యోగాలు‌

image

హైదరాబాద్‌లోని<> ECIL <<>>15 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రాజెక్ట్ ఇంజినీర్-C, టెక్నికల్ ఎక్స్‌పర్ట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ, బీటెక్ , సీఎంఏ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 19, 20 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు నెలకు రూ.40వేలు, టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌కు రూ.1,25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in/