News May 21, 2024
ట్యాంక్ బండ్ వద్ద పర్యాటకుల సందడి!

HYDలోని పర్యాటక ప్రదేశాలకు ఇటీవల ప్రజలు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే జూపార్కుకు 25,600 మంది వచ్చిన విషయం తెలిసిందే. ఇక అదే రోజు ట్యాంక్ బండ్‌కు లక్ష మందికిపైగా రాగా 13,350 మంది బోటు షికారు చేసి గత రికార్డులన్నీ బద్దలుకొట్టారు. ఆ రోజు రూ.13.52 లక్షల ఆదాయం వచ్చిందని జి.ప్రభుదాస్ తెలిపారు. కొవిడ్ తర్వాత ఇంత ఆదాయం రావడం ఇదే ప్రథమమన్నారు. సోమవారం సాయంత్రం సైతం భారీగా జనం వచ్చారు.
Similar News
News November 27, 2025
HYD: FREEగా వెళ్లొద్దాం రండి!

HYD పరిధి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది. నవంబర్ 30 వరకు ఉ.10 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుందని HYD టూరిజం తెలిపింది. ఉచితంగా రాష్ట్రపతి నిలయం, వివిధ రకాల, కళలు వీక్షించే అవకాశం ఉంది. సా.7:00 వరకు లాస్ట్ ఎంట్రీగా పేర్కొన్నారు. QR కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి.
News November 27, 2025
అయోధ్య ఆలయంలో హైదరాబాద్ కిటికీలు

కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని) సంస్థ అయోధ్యలోని రామాలయం కోసం కిటికీలను తయారుచేసింది. టైటానియం ఆర్కిటెక్చరల్ విండోలను తయారుచేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిథాని అధికారులు తెలిపారు. 31 కీటికీలను తయారు చేసి ఆలయానికి ఇచ్చామని వివరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రదక్షణ కారిడార్ కోసం ఇంజినీరింగ్ విభాగం వీటిని తయారుచేసింది.
News November 26, 2025
HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.


