News May 21, 2024
ట్యాంక్ బండ్ వద్ద పర్యాటకుల సందడి!
HYDలోని పర్యాటక ప్రదేశాలకు ఇటీవల ప్రజలు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే జూపార్కుకు 25,600 మంది వచ్చిన విషయం తెలిసిందే. ఇక అదే రోజు ట్యాంక్ బండ్‌కు లక్ష మందికిపైగా రాగా 13,350 మంది బోటు షికారు చేసి గత రికార్డులన్నీ బద్దలుకొట్టారు. ఆ రోజు రూ.13.52 లక్షల ఆదాయం వచ్చిందని జి.ప్రభుదాస్ తెలిపారు. కొవిడ్ తర్వాత ఇంత ఆదాయం రావడం ఇదే ప్రథమమన్నారు. సోమవారం సాయంత్రం సైతం భారీగా జనం వచ్చారు.
Similar News
News December 2, 2024
HYD: మాలలకు రాజ్యాంగం మద్దతు ఉంది: రాజేశ్ మహాసేన
పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాలల సింహగర్జన సభకు ఆంధ్రా నుంచి పిలుపు అందుకున్న రాజేశ్ మహాసేన వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంద కృష్ణ మాదిగ 30 ఏళ్లుగా రాష్ట్ర, కేంద్ర నాయకులు, సుప్రీంకోర్టు మద్దతు ఉంది అని చెప్పుకుంటు తిరుగుతున్నారన్నారు. దేశం మొత్తం మద్దతు వుండొచ్చు కానీ తమ జాతికి డా.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి మాలలు భారీగా తరలివచ్చారు.
News December 2, 2024
HYD: చుక్కా రామయ్య ఆరోగ్యంపై హరీశ్‌రావు ఆరా
నల్లకుంటలోని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త ఐఐటీ చుక్కా రామయ్య ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. అంబర్‌పేట MLA కాలేరు వెంకటేశ్‌తో కలిసి హరీశ్‌రావు ఆయనతో ముచ్చటించారు. గత నెల 20న చుక్కా రామయ్య పుట్టినరోజు రాలేకపోయానని తెలిపారు. దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితర నాయకులు ఉన్నారు.
News December 1, 2024
HYD: మాలలు ఐక్యతను చటాలి: ఎమ్మెల్యే వివేక్
మాల, మాధిగలను వేరు చెయ్యాలని చూస్తున్నారని, మాలలు ఐక్యంగా పోరాడి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన మాలల సింహగర్జన సభకు ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. మాలల ఐక్యత చాటేలా నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి నినదించారు. రాష్ట్ర నలుమూలల నుంచి మాలలు భారీగా తరలివచ్చారు.