News February 26, 2026
ట్రంప్ కొత్త టారిఫ్స్: 15% కంటే ఎక్కువే..!

ట్రంప్ విధించిన అధిక టారిఫ్స్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో ట్రంప్ మరో కొత్త ప్లాన్‌తో సిద్ధమవుతున్నారు. ఇటీవల ప్రకటించిన 15% గ్లోబల్ టారిఫ్స్ అన్ని దేశాలకూ ఒకేలా ఉండవని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమీసన్ గ్రీర్ స్పష్టం చేశారు. కొన్ని దేశాలకు అంతకంటే ఎక్కువే ఉండే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. సరైన సమయంలో వాటిని ప్రకటిస్తామన్నారు. ఇది ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Similar News
News April 14, 2026
నేను రఫ్ డాడీని: రామ్ చరణ్

పిల్లలే తన ప్రాణమని, వాళ్లు లేకపోతే ఇల్లు బోసిపోయినట్లు ఉంటుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ‘నేను రఫ్ డాడీని. పిల్లల్ని గంతులేయనివ్వడం, ఎక్కనివ్వడం, రిస్క్ తీసుకోనివ్వడం వంటివి చేస్తాను. వారితో సమయం గడిపే తండ్రిగా ఉండాలనుకుంటా. నా ప్రపంచాన్ని కాస్త చిన్నదిగా, పరిమితంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’ అని Esquire India ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
News April 14, 2026
కూరగాయల పంటల్లో వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు

వైరస్ తెగుళ్ల కట్టడికి రసం పీల్చే పురుగులను నివారించడం ముఖ్యం. అలాగే రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాల ఎంపిక, పంట మార్పిడి, అంతర పంటలను సాగు చేయాలి. పంట పొలం చుట్టూ జొన్న లేదా మొక్కజొన్న పంటలను కంచె పంటగా సాగు చేయాలి. కలుపు మొక్కలను తొలగించాలి. విత్తనం నాటే ముందు పొలానికి ట్రైకోడెర్మా, వేపపిండి కలిపి వేయడం, గుళికలమందు వాడకం, విత్తనశుద్ధి మంచి ఫలితాలిస్తాయి.
News April 14, 2026
గొర్రె పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

గొర్రె పిల్లలకు పుట్టిన మొదటి రోజు నుంచి 20 వారాల వయసు వచ్చేవరకు వివిధ దశలలో సరిపడేంతగా పాలను, క్రీపు దాణాను, T.M.R(టోటల్ మిక్స్‌డ్ రేషన్)ను నిర్దేశిత పరిమాణంలో అందించాలి. వీటిని సరైన పరిమాణంలో అందిస్తే 5 లేదా 6 నెలల వయసులోనే గొర్రె పిల్లలు 28 నుంచి 30 కిలోల బరువు పెరుగుతాయి. దీని వల్ల త్వరగా వీటిని కోతకు అమ్మి మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే వాటి మరణాల శాతాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.


