News November 29, 2024
ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని నక్కల మిట్ట వద్ద ట్రాక్టర్ టైర్ పేలి బోల్తాపడటంతో మల్లికార్జున(25) మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ రామాంజనేయలు వివరాల ప్రకారం.. ఓర్వకల్ నుంచి వెల్దుర్తికి రాళ్ల లోడ్‌తో వస్తుండగా ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులు నాగేశ్వరావు, కృష్ణలను స్థానికులు హుటాహుటిగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 6, 2024
7న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం: కలెక్టర్
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఈనెల 7న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీరంజిత్ బాషా వెల్లడించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థి ప్రగతి తెలుసుకోవడానికి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన విద్య అందించడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థులకు మధ్య మంచి సంబంధాలు నెలకొనేందుకు ఉపయోగపడతాయన్నారు.
News December 6, 2024
అనుమానాస్పద స్థితిలో తల్లీ, కూతురి మృతి
హోళగుంద మండలం హెబ్బటంలో గురువారం సాయంత్రం తల్లీ, కూతురు అనుమానాస్పద స్థితిలో మృతించెందారు. కంబదహాల్‌కు చెందిన సకరప్పకు, ఇంగళదహల్‌కు చెందిన సలీమా(21)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి కోసం రెండేళ్ల క్రితం హెబ్బటం వచ్చారు. వీరికి మూడేళ్ల కూతురు సమీరా ఉంది. గురువారం భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని, నీ కూతురు, మనవరాలు చనిపోయి ఉన్నారని పక్కింటి వారు తమకు ఫోన్ చేసి చెప్పారని మృతురాలి తల్లి తెలిపారు.
News December 6, 2024
ఆదోనిలో టీచర్ భారతి ఆత్మహత్య
ఆదోనిలోని ప్రభుత్వ టీచర్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని పూల బజార్ వీధిలో నివాసముంటున్న ఎస్ఎం భారతి గురువారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త శివ ప్రకాశ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఆదోని జనరల్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.