News October 17, 2024

ట్రాన్స్ జెండర్‌లకు సమాన అవకాశాలు కల్పిస్తాం: నంద్యాల కలెక్టర్

image

సమాజంలో పురుషులు, స్త్రీలతో పాటు ట్రాన్స్ జెండర్‌లకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తామని నంద్యాల కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ట్రాన్స్ జెండర్‌ల అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ట్రాన్స్ జెండర్లు మెరుగైన జీవితాన్ని అవలంబించేందుకు పురుషులు, స్త్రీలతో సమాన అవకాశాలు కల్పిస్తూ ఉపాధి మార్గాలు చూపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News October 17, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాలో సెలవు ఇవ్వాలని డిమాండ్

image

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని జిల్లా వాసులను చల్లటి గాలులు పలకరిస్తున్నాయి. మిడుతూరు, మహానంది, ఆళ్లగడ్డ, డోన్ తదితర మండలాల్లో రాత్రి జోరు వర్షం కురిసింది. నేడూ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలపడంతో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులివ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముసురు వాతావరణంతో బయటకు వచ్చే పరిస్థితిలేదని సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.

News October 17, 2024

ఆలూరు: చేనుకు గడ్డి మందు కొట్టిన దుండగులు

image

ఆలూరు మండలంలోని మనేకుర్తి గ్రామానికి చెందిన ఈరమ్మ 9 ఎకరాల్లో రూ.1.50 లక్షల ఖర్చుతో జొన్న పంట సాగుచేసింది. బుధవారం చేనుకు వెళ్లి చూడగా పంటకు ఎవరో గడ్డిమందు కొట్టారని బాధిత మహిళ వాపోయింది. అయితే ఆస్తి పంపకాలు చేయలేదని తన కుమారులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆమె ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News October 16, 2024

రాష్ట్రంలోనే నంద్యాల జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురండి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర@2047లో భాగంగా నంద్యాల జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న నిర్దిష్ఠ లక్ష్యంతో అధికారులు పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో స్థూల దేశీయోత్పత్తి, ఆదాయ వృద్ధిరేట్లపై జిల్లా అధికారులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.