News October 29, 2024

ట్రాన్స్ జెండర్లకు సహాయ సహకారాలు: కలెక్టర్

image

ప్రభుత్వం తరఫున ట్రాన్స్ జెండర్లకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ట్రాన్స్ జెండర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ట్రాన్స్ జెండర్‌కు పెన్షన్ అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 12, 2024

భూసేకరణను త్వరగా పూర్తి చేయండి: నంద్యాల కలెక్టర్

image

జాతీయ రహదారులు, రైల్వే నిర్మాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజిఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో ప్రగతి అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణను పూర్తి చేసేందుకు ఆర్డీవోలు, తహశీల్దార్లు చొరవ తీసుకోవాలన్నారు.

News November 12, 2024

జగన్.. పులివెందుల పౌరుషం ఉంటే రా: మంత్రి బీసీ

image

మాజీ సీఎం జగన్‌కు మాట్లాడేందుకు మైక్ ఇస్తాం.. పులివెందుల పౌరుషం ఉంటే అసెంబ్లీకి రావాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘అసెంబ్లీలో ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధం. తప్పులు చేసినందుకే జగన్ అసెంబ్లీకి రావడం లేదు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, అనుచిత పోస్టులు పెడితే ఊరుకోం. చట్ట ప్రకారం కచ్చితంగా శిక్షిస్తాం’ అని స్పష్టం చేశారు.

News November 12, 2024

సీఎం చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సత్యప్రకాశ్

image

బనగానపల్లె MPPS కస్బా పాఠశాల ఉపాధ్యాయుడు కే.సత్య ప్రకాశ్ జాతీయ విద్య దినోత్సవం పురస్కరించుకొని విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్ లబ్బిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా సోమవారం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆయనకు శాలువా కప్పి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.