News March 18, 2025
ట్రిపుల్ ఐటీలకు మే7 నుంచి వేసవి సెలవులు

రాజీవ్ గాంధీ సాంకేతిక వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (ఆర్జీయుకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీలకు మే 7తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ఆర్జీయూకేటీ రిజిస్టర్ ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. నూజివీడులో ఆయన సోమవారం మాట్లాడుతూ.. వేసవి సెలవుల అనంతరం జూన్ 30వ తేదీన క్లాసులు పునఃప్రారంభం అవుతాయన్నారు. బాలికలను గమ్యస్థానాలకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Similar News
News March 19, 2025
నిద్రపోయే ముందు నీరు తాగుతున్నారా?

రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం బాగా జీర్ణం అవడంతో పాటు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తదితర సమస్యలు తొలగిపోతాయి. పొట్ట తేలికగా మారిన భావన కలుగుతుంది. వీటితో పాటు నాడీ వ్యవస్థ రిలాక్స్ అయి ఒత్తిడి తగ్గుతుంది. యాంగ్జైటీ వంటి సమస్యలు దూరమై హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి గోరువెచ్చని నీరు చక్కటి పరిష్కారం.
News March 19, 2025
తూ.గో. జిల్లాలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

AP: తూ.గో. జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ, వన్యప్రాణి సంరక్షణపై అటవీ శాఖ ఉద్యోగులు లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణ అక్కడ ఉండాలని Dy.CM పవన్ అన్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా తాజాగా దివాన్ చెరువు ప్రాంతంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.
News March 18, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.15,800(నిన్న 16వేలు) పలకగా.. 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.11,000 ధర వచ్చింది. అలాగే టమాటా మిర్చికి నిన్నటిలాగే రూ.30 వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.33వేలు (నిన్న రూ.32వేలు) ధర, ఎల్లో మిర్చికి రూ.20,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.