News July 11, 2024
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలు ఇవే.!

రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించనున్న కౌన్సెలింగ్ తేదీలను ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ ఆచార్య కేసీరెడ్డి ప్రకటించారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 22, 23 తేదీల్లో, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 24, 25 తేదీల్లో ఇడుపులపాయలో, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 26, 27 తేదీల్లో శ్రీకాకుళంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Similar News
News November 14, 2025
కృష్ణా: పొలాల్లో తగ్గని వర్షపు నీరు.. కుళ్లిపోతున్న వరి పనలు

మొంథా తుపాన్ బారిన పడిన రైతాంగం నేటికీ కోలుకోలేని పరిస్థితి కృష్ణా జిల్లాలో నెలకొంది. తుపాన్ ప్రభావం తగ్గి 20 రోజులు గడుస్తున్నా నేటికీ కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీరు తగ్గకపోవటంతో దాని ప్రభావం దిగుబడులపై చూపుతోంది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షపు నీటిలో వరి పనలు నానిపోవడంతో ధాన్యపు కంకులు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 14, 2025
కృష్ణా: రేపటి నుంచి మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ

మహిళలకు రేపటి నుంచి స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు నైపుణ్యాభివృద్ధి మహిళా సాధికారత కేంద్రం జిల్లా మేనేజర్ ఎస్. జుబేదా పర్వీన్ శుక్రవారం తెలిపారు. పామర్రు (M) నిమ్మకూరు ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రంలో 18-35 వయసు కలిగిన మహిళలకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ బ్యూటీ తెరపిస్ట్, జనరల్ డ్యూటీ నర్సింగ్ అసిస్టెంట్, మగ్గం వర్క్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
News November 14, 2025
అప్పుడు జోగి రవాణా అయితే ఇప్పుడు ఎవరి రవాణా.?

పెడన నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన బుసక రవాణా నేటికీ కొనసాగుతూనే ఉంది. కూటమి నాయకుల ఆరోపణల ప్రకారం, వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన బుసక రవాణా మొత్తం అప్పటి మంత్రి జోగి రమేశ్ కనుసన్నల్లో జరిగిందని ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతిస్పందించిన వైసీపీ నాయకులు, బుసక రవాణా నేటికి కూడా అలాగే కొనసాగుతుంది. అప్పుగు జోగి కారణం అయితే, నేడు జరుగుతున్న రవాణాకు బాధ్యత ఎవరిది.? అని ప్రశ్నిస్తున్నారు.


