News September 24, 2024

ట్రైని ఎస్సైలు నిజాయితీగా ప్రజలకు సేవలందించాలి: వరంగల్ సీపీ

image

వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు నిజాయితీగా సేవలందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించిన 19 మంది నూతన ట్రైని ఎస్సైలు బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలను అభినందించారు.

Similar News

News January 6, 2026

పంట వ్యర్థాలను కాల్చొద్దు: వరంగల్ డీఏవో

image

ప్రత్తి పంటల కోత అనంతరం మిగిలే పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందడంతోపాటు భూసారం పెంచి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి కె.అనురాధ తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూమిలోని మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు నశించడమే కాకుండా గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు.

News January 6, 2026

వరంగల్: రెన్యువల్ చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ జాప్యం!

image

వరంగల్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులకు సంబంధించి అనుమతుల పునరుద్ధరణ(రెన్యువల్) చేయడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జాప్యం చేస్తున్నారు. జిల్లాలో 180కి పైగా ప్రైవేట్ ఆస్పత్రిలో ఉండగా అందులో సగానికి పైగా రెన్యువల్ కాలేదు. దీంతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు సీఎం సహాయ నిధి పథకం కింద వైద్యం అందించలేకపోతున్నారు. తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని ఆసుపత్రుల నిర్వాహకులు వాపోతున్నారు.

News January 6, 2026

వరంగల్: జిల్లా స్థాయి యువజనోత్సవాలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవాపథకం (ఎన్‌ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఈనెల 6న హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించాల్సిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి యువ జనోత్సవాలను వాయిదా వేసినట్లు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.