News September 18, 2024
ట్రైనీ ఐపీఎస్‌గా నంద్యాల జిల్లా యువ ఐపీఎస్ మనీషా రెడ్డి

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఏపీకి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది. నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లెకు చెందిన వంగల మనీషా రెడ్డి ఆ జాబితాలో ఉన్నారు. సొంత రాష్ట్రానికి ట్రైనీ ఐపీఎస్‌గా కేటాయించడంతో నందిపల్లి గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News February 12, 2026
మహాశివరాత్రి వేళ.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదన్నారు. OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు.
News February 12, 2026
టీచర్ లేకుండా ఎలా పాసవ్వాలి.. విద్యార్థుల ఆవేదన

కోడుమూరు జడ్పీ బాలుర పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు కాళీ ఏర్పడింది. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో సైన్స్ టీచర్ లేకపోవడంతో ఏ విధంగా పరీక్షలకు సిద్ధం కావాలో అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. సైన్స్ టీచర్‌ను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.
News February 12, 2026
కర్నూలు: 18న కోర్టు పోస్టులకు పరీక్ష

కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్, ఫ్రెంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ రెగ్యులర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 18న నగరంలోని ప్రసూన న్యాయ కళాశాలలో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. అర్హత, అనర్హత అభ్యర్థుల జాబితాను www.ecourtskurnool.com, https://kurnool.dcourts.gov.inలో ఉంచామన్నారు.


