News February 13, 2026
ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా.. ఇది మర్చిపోవద్దు!

భారతీయ రైల్వే 45 పైసలకే ₹10 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇస్తోందని తెలుసా? ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వారికి ఈ సర్వీసును అందిస్తోంది. ప్రమాదంలో మరణించినా/శాశ్వత వైకల్యం ఏర్పడినా ₹10 లక్షలు, పాక్షిక వైకల్యానికి ₹7.5 లక్షలు, గాయపడితే ₹2 లక్షలు అందిస్తుంది. మృతదేహం తరలింపుకు ₹10 వేలు ఇస్తుంది. బుకింగ్ సమయంలో ఇన్సూరెన్స్ కోసం నామినీ వివరాలు ఎంటర్ చేయడం మర్చిపోవద్దు.
Similar News
News March 15, 2026
వారికి LPG సిలిండర్లు బంద్.. కేంద్రం ప్రకటన

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు ఉన్నవారికి ఎల్పీజీ సిలిండర్లు సప్లై చేయవద్దని కేంద్రం ఆదేశించింది. PNG వినియోగించుకుంటూనే డొమెస్టిక్ సిలిండర్లు తీసుకోవడం మంచిది కాదంది. వెంటనే LPG కనెక్షన్లు సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. చమురు సంస్థలు వారికి కొత్తగా LPG కనెక్షన్లూ ఇవ్వొద్దని ఆదేశించింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో HYDతో పాటు విశాఖ, విజయవాడ, గుంటూరు, కడప తదితర నగరాల్లో PNG సౌకర్యం ఉంది.
News March 15, 2026
గల్ఫ్ దేశాలపై దాడులు చేయొద్దు.. ఇరాన్‌ను కోరిన హమాస్!

గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలని తన మిత్రదేశం ఇరాన్‌ను పాలస్తీనా ఆర్మ్‌డ్ గ్రూప్ హమాస్ కోరింది. ‘పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోవద్దని ఇరాన్ సోదరులను కోరుతున్నాం. ఈ ప్రాంతంలోని దేశాలన్నీ సోదరభావాన్ని కాపాడుకోవడానికి సహకరించాలి’ అని విజ్ఞప్తి చేసింది. US, ఇజ్రాయెల్ దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని చెప్పింది. యుద్ధాన్ని ఆపేందుకు అన్ని దేశాలు, సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చింది.
News March 15, 2026
ఎండల తీవ్రత.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

వేసవిలో కోళ్లకు అందించే దాణా, నీటి పరిమాణం 1:2 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే 1:4 నిష్పత్తిలో ఉండాలి. నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్స్ కలిపితే కోళ్లు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. వీలైనంత వరకు కోళ్లకు ఎండలో ఉండే నీరు కాకుండా చల్లగా ఉండే నీటినే ఇవ్వాలి. కోళ్ల షెడ్లపైన గడ్డి కప్పి, స్ప్రింకర్లు అమర్చి.. షెడ్డు లోపల ఫాగర్స్‌తో ఎండ సమయంలో అరగంటకు ఒకసారి నీరు చల్లాలి.


