News March 20, 2025
ట్రోఫీలు అందుకున్న జిల్లా నేతలు

విజయవాడలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రెండు రోజుల పాటు క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో మంత్రి TG భరత్ విన్నర్‌గా నిలిచారు. ఎమ్మిగనూరు MLA నాగేశ్వరరెడ్డి రన్నన్గా నిలిచారు. ఇక డబుల్స్‌లో మంత్రి సత్యకుమార్‌తో కలిసి నాగేశ్వరరెడ్డి విన్నర్‌గా నిలిచారు. సింగిల్స్ ఉమెన్స్ పోటీల్లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రన్నర్‌గా నిలిచారు. సీఎం, డిప్యూటీ సీఎం నుంచి వారు ట్రోఫీలు అందుకున్నారు.
Similar News
News November 16, 2025
రేపు నూజివీడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నూజివీడు పట్టణ పరిధిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ..రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చు అన్నారు. ప్రతి అర్జీ ఆన్లైన్ చేయడం, నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
News November 16, 2025
HYD: వేగం ప్రాణాలు తీస్తోంది! జర పైలం

HYDలో అతివేగం కారణంగా ప్రాణ నష్టం పెరుగుతోంది. 2023- 2025 అక్టోబర్ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 34% కేసులు అధిక వేగమే ప్రధాన కారణంగా గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వేగం నియంత్రణ కోల్పోవడం, ఢీ కొనడం, ఆలస్యమైన సహాయం వంటి కారణాలతో మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అధికారులు స్పష్టంచేశారు.
News November 16, 2025
HYD: జనాభా కోటికి చేరినా.. పెరగని మానిటరింగ్ స్టేషన్లు

గ్రేటర్లో జనాభా వేగంగా పెరుగుతున్న కొద్దీ గాలి కాలుష్యం కూడా తీవ్రమవుతోంది. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పనిచేస్తున్న గాలి నాణ్యత పరిశీలన స్టేషన్లు పరిమితంగా ఉండటంతో సరైన రికార్డులు రావటం లేదు. నగర జనాభా దాదాపు కోటికి చేరిన నేపథ్యంలో మరిన్ని మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం అత్యవసరమని పలు నివేదకలు హెచ్చరిస్తున్నాయి.


