News September 4, 2024
ట్విట్టర్ వేదికగా దీప్తికి మంత్రి అభినందనలు
తెలుగు రాష్ట్రాల నుంచి పారా ఒలంపిక్స్‌లో తొలి పథకాన్ని సాధించిన ఓరుగల్లు బిడ్డ దీప్తి జీవాంజికి మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. ఎన్నో కష్టాలను అధిగమించి ప్రపంచ వేదికపై కాంస్య పతకాన్ని గెలుచుకోవడం దేశానికే గర్వకారణమన్నారు. పేద కుటుంబం నుంచి పతక విజేత వరకు దీప్తి సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో మంత్రి అభినందనలు తెలిపారు.
Similar News
News September 14, 2024
కాజీపేటలో వందేభారత్ హాల్ట్
సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్‌పూర్‌లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది.
News September 14, 2024
వరంగల్ జిల్లాకు రూ.3కోట్లు
ఇటీవల కురిసిన వర్షాలు జిల్లాలో తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. ఆ నష్టవివరాలను అందజేయాలని వరంగల్ కలెక్టర్ డా. సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో జిల్లాకు రూ.3కోట్ల నిధులను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్ట అంచనా తయారు చేయాలని ఆమె సూచించారు.
News September 14, 2024
దేశం ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయింది: సీతక్క
దేశం ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. భారతీయ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా సీతారాం ఏచూరి గుర్తింపు పొందారని, దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యునిస్టు రాజకీయాలపై చెరగని ముద్రవేసుకున్న ప్రజా ఉద్యమకారుడు సీతారాం ఏచూరి అని అన్నారు.