News April 24, 2024
డక్కిలి: దగ్గవోలు హైస్కూల్లో 100 శాతం ఉత్తీర్ణత
డక్కిలి మండల పరిధిలోని దగ్గవోలు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 35 మందికి 35 మంది పాసయ్యారు. ఇందులో కే.శ్రావ్య 600 మార్కులు గాను 519 మార్కులు సాధించి పాఠశాలలో మొదట స్థానంలో నిలిచారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. పాఠశాలకు 100% ఉత్తీర్ణత రావడం సంతోషం అని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
Similar News
News January 24, 2025
గూడూరుకు నేడు జిల్లా కలెక్టర్ రాక
శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ రేపు గూడూరు డివిజన్ కు రానున్నారు. చిల్లకూరు సాగరమాల జాతీయ రహదారి package-4 నిర్మాణ పనులు పరిశీలించుటకు రానున్నట్లు తెలుస్తోంది. సాగరమాల జాతీయ రహదారి నిర్మాణ పనులు ఇప్పటివరకు ఎంతమేరకు జరిగాయి అన్న వివరాలు తెలుసుకునేందుకు రానున్నట్లు తెలుస్తోంది.
News January 23, 2025
ఉదయగిరిలో నకిలీ ఫోన్‌పే యాప్‌తో మోసాలు
నెల్లూరు జిల్లాలో ఆన్‌లైన్ మోసాలు రోజుకొక కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. తాజాగా ఉదయగిరిలో నకిలీ ఫోన్‌పే యాప్‌తో మోసాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో రూ.4 వేలకుపైగా మద్యం కొనుగోలు చేసి ఫోన్‌పే ద్వారా నగదు పంపించాడు. అయితే డబ్బులు రాకపోవడంతో అనుమానించిన దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.
News January 23, 2025
వివిధ రకాల ఉద్యోగాలకు మెరిట్ జాబితా విడుదల
నెల్లూరు నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వివిధ రకాల ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాలను విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజమన్నార్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను spsrnellore.ap.gov.in అనే వెబ్సైట్లో పొందుపరిచారన్నారు. మెరిట్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్స్ ద్వారా తెలియపరచాలన్నారు.