News February 21, 2025
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మడానికి వీల్లేదు: కలెక్టర్

ఇప్పటి వరకు పట్టాలు ఇచ్చిన రెండు పడకల గృహాల్లో అసలైన లబ్ధిదారులు నివాసం లేనివి గుర్తించి నోటీసులు జారీ చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అద్దెకుగాని, లీజ్‌కు లేదా అమ్మడానికి వీలు లేదన్నారు.
Similar News
News December 8, 2025
ప.గో జిల్లా కీలక నేత వైసీపీకి ‘బై’

తాడేపల్లిగూడేనికి చెందిన వైసీపీ ఎస్టీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు కావాడి శివ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ రాజుకు అందజేసినట్లు సోమవారం తెలిపారు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడం, తగిన గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు.
News December 8, 2025
ఖమ్మం: ఉద్యోగులకు కోడ్ ఆఫ్ కండక్ట్.. కరచాలనం చేసినా తప్పే!

ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అభ్యర్థులతో కరచాలనం చేసినా, అనవసర సాన్నిహిత్యం ప్రదర్శించినా అది ఎన్నికల నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘన అవుతుందని సంఘం హెచ్చరించింది. అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారనే భావన ప్రజల్లో కలిగితే, అది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. నిబంధనలు అతిక్రమిస్తే, సర్వీసు నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
News December 8, 2025
ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ జూన్‌లో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కాగా ప్రస్తుతం ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి పని చేస్తున్నారు.


