News October 2, 2024
డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు శుభవార్త: మంత్రి పొంగులేటి
దసరా పండుగ సమీపిస్తోన్న వేళ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్ర సచివాలయం వేదికగా మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పండుగలోపే అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందిస్తామని అన్నారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
Similar News
News October 7, 2024
‘డీఎస్సీ 2008 ఏజెన్సీ అభ్యర్థుల జాబితా సవరించాలి’
ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్సీ 2008 అర్హుల జాబితాలో తప్పులు చోటుచేసుకున్నాయని, వాటిని సవరించి కొత్త జాబితా విడుదల చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర నాయకులు కల్తి రాంప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కారేపల్లిలో జరిగిన డీఎస్సీ 2008 బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ఏరియా గిరిజన అభ్యర్థుల లిస్టుల తయారీలో జరిగిన తప్పిదాన్ని అధికారులు గుర్తించాలన్నారు.
News October 6, 2024
రఘునాథపాలెం: బతుకమ్మ పూల కోసం వెళ్లి కరెంట్ షాక్‌తో మృతి
రఘునాథపాలెం మండలం పాపడపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఆదివారం మిట్టపల్లి చరణ్ తేజ్ బతుకమ్మ కోసం డాబాపైన పూలు కోస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తాకి షాక్‌కు గురై మృతి చెందాడు. పలుమార్లు విద్యుత్ అధికారులకు వైర్లు కిందకు ఉన్నాయని చెప్పిన పట్టించుకొలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
News October 6, 2024
ఖమ్మం: వెదురు కోసం వెళ్లి గుండెపోటుతో మృతి
గుండెపోటులో వ్యక్తి చనిపోయిన ఘటన తల్లాడ మండలం జగన్నాథపురంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన మల్లికార్జునరావు (50) శనివారం ఉదయం వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లాడు. గుండెనొప్పి వస్తోందని మధ్యాహ్నం తనతో ఉన్నవారికి చెప్పాడు. వారు మల్లికార్జునరావును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.