News March 24, 2025
డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్‌లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
Similar News
News April 17, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ ఆదోనిలో 19న జాబ్‌మేళా➤ మంత్రాలయం: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య➤ సీజ్ ద గోడౌన్: ఎంపీ శబరి➤ ఆదోనిలో అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్➤ హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి: జిల్లా ఎస్పీ➤ కోడుమూరు: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి➤ కర్నూలు: సీనియర్ సిటిజన్ ఐడీకి ఆన్‌లైన్ దరఖాస్తులు➤ ప్రతి ఒక్కరికి క్రీడా స్ఫూర్తి అవసరం:డీఐజీ➤ కర్నూలుకు చేరుకున్న కేంద్ర మంత్రి ప్రహల్లాద్ జోషి
News April 17, 2025
కర్నూలు: సీనియర్ సిటిజన్ ఐడీకి ఆన్‌లైన్ దరఖాస్తులు

జిల్లా వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వయో వృద్ధుల సంక్షేమశాఖ అధికారి రయిస్ ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 ఏళ్లు పైబడిన పురుషులు, 58 ఏళ్లు పైబడిన మహిళలు సీనియర్ సిటిజన్లు అర్హులన్నారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్, పాసుపోర్టు సైజు ఫొటోతో వార్డు, గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News April 17, 2025
కోడుమూరు: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

కోడుమూరు మండలం వర్కూరు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెల్తుర్ధి మండలం శ్రీరంగపురానికి చెందిన వెంకటరాముడి మృతి చెందాడు. ఇరు బైక్‌ల మీద ఉన్న అరవింద్, వేణులు, బదినేహాల్ వాసులు షాషావలి, దాదపీరాలు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం కర్నూలు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.