News January 19, 2025
డబ్బా కొట్టడం మానేసి పాలనపై దృష్టి పెట్టండి: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలపై ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారూ.. మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొందని తెలిపారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
Similar News
News February 5, 2025
సంగారెడ్డి: నవ వధువు సూసైడ్
అదనపు కట్నం వేధింపులతో <<15357920>>నవ వధువు<<>> సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ సాకేత్ నగర్‌కు చెందిన సాయికి సంగారెడ్డి జిల్లా మునిపల్లికి చెందన శ్రీజతో గతేడాది నవంబర్‌లో పెళ్లైంది. ఇంతలో అదనపు కట్నం కోసం భర్త వేధించ సాగాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చే స్థితిలో మా వాళ్లు లేరని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భర్త వినలేదు. దీంతో విషయం కుటుంబీకులు నిన్న ఫోన్లో చెప్పిన శ్రీజ అనంతరం ఇంట్లో ఉరేసుకుంది.
News February 5, 2025
శివంపేట హత్య కేసు UPDATE
శివంపేట మండలం సామ్యతండాలో శనివారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండాకు చెందిన మదన్‌లాల్‌ను కత్తితో పొడిచి హత్య చేయగా ఈ కేసుపై తూప్రాన్ సీఐ రంగాకృష్ణ దర్యాప్తు చేపట్టారు. మదన్‌లాల్‌ను అన్న కొడుకే హత్య చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. అతడికి సహకరించిన మరో వ్యక్తిని సైతం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
News February 5, 2025
ఆర్టీసీ బస్సులను వినియోగించుకోండి: డీఎం సురేఖ
వివాహ శుభకార్యాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని మెదక్ డీఎం సురేఖ కోరారు. 200 కిలోమీటర్లకు పల్లెవెలుగు బస్సుకు రూ.13,200, ఎక్స్ ప్రెస్ బస్సుకు రూ.14,700 ఉంటుందన్నారు. ఈ రేట్లు 12 గంటల సమయం పాటు వర్తిస్తాయని, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆమె కోరారు.