News January 28, 2025
డయల్ డీఎం ప్రోగ్రాంకు అపూర్వ స్పందన:DM

వనపర్తి డిపోలో డయల్ డీఎం కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభించిందని DM వేణుగోపాల్ తెలిపారు. బెంగళూరు బస్సును వయా కొత్తకోట మీదుగా నడపాలని కోరారన్నారు. వేముల, బుద్ధారం గండి వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆపాలని విజ్ఞప్తి చేశారన్నారు. రాత్రి 11 గం.లకు MGBS నుంచి బస్సు వేయాలని అడిగారన్నారు. ఇంకా పలు సూచనలు వచ్చాయన్నారు.
Similar News
News November 21, 2025
ఎనుమాముల మార్కెట్ వద్ద ఫిట్స్‌తో వ్యక్తి మృతి

వరంగల్ ఎనుమాముల మార్కెట్ వద్ద ఫిట్స్ వచ్చి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని దేశాయిపేటకు చెందిన చంద్రమౌళి (40)గా గుర్తించారు. మార్కెట్లో పనిచేసే చంద్రమౌళి ప్రతిరోజూ లాగే బైక్‌పై వస్తుండగా, మార్కెట్ ముందు ఫిట్స్ రావడంతో బండి మీద నుంచి కింద పడి మృతి చెందాడు. చంద్రమౌళికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News November 21, 2025
హ్యాపీగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినండి

మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందంటున్నారు నిపుణులు. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బెర్రీస్, అరటిపండ్లు, నట్స్, ఫ్యాటీ ఫిష్, ప్రోబయాటిక్స్, ఓట్స్, ఆకుకూరలు, గుడ్లు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్ హెల్త్ బావుండేలా చూస్తాయంటున్నారు నిపుణులు.
News November 21, 2025
బాపట్ల: నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

బాపట్ల జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.apgov.in లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.


