News February 5, 2025
డయల్-100కు జనవరి నెలలో 4056 కాల్స్

సమాజంలో పెరిగిపోయిన నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల ధన, మాన ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100కు జనవరి నెలలో 4056 కాల్స్ వచ్చాయని పోలీస్ కమిషనర్ సునీల్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిపై 57 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని, వీటిలో హత్యాయత్నం-1, మహిళలపై వేధింపులు – 1, దొంగతనాలు – 9, సాధారణ ఘటనలు – 14, యాక్సిడెంట్లు 11, అనుమానాస్పద మరణాలు-4, ఇతర కేసులు-17 అని తెలిపారు.
Similar News
News February 10, 2025
బ్యాటింగ్ ఎంజాయ్ చేశా.. సెంచరీపై రోహిత్ కామెంట్

ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో సెంచరీ చేసి జట్టు కోసం నిలబడటం సంతోషాన్నిచ్చిందని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తన బ్యాటింగ్ ఎంజాయ్ చేశానని చెప్పారు. బ్యాటింగ్‌కు దిగినప్పుడే వీలైనన్ని ఎక్కువ రన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తన బాడీని లక్ష్యంగా చేసుకొని వేసిన బంతులపై సరైన ప్రణాళికలు అమలు చేశానని పేర్కొన్నారు. ఇక గిల్ చాలా క్లాసీ ప్లేయర్ అని రోహిత్ కితాబిచ్చారు.
News February 10, 2025
నేడు ‘ఏరో ఇండియా షో 2025’ ప్రారంభం

భారత రక్షణశాఖ నేటి నుంచి ఈనెల 14 వరకు ‘ఏరో ఇండియా షో 2025’ను నిర్వహించనుంది. బెంగళూరుకు సమీపంలోని యెలహంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జరగనున్న ఈ షోను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. SU-57, F-35 యుద్ధ విమానాలు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 150 విదేశీ సంస్థలతో సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఈవెంట్‌గా ఇది నిలవనుంది. 43 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.
News February 10, 2025
వన్డేల్లో అత్యధిక సెంచరీలు వీరివే

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(50) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్ (49), మూడో స్థానంలో రోహిత్ శర్మ (32) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా రికీ పాంటింగ్ (30), జయసూర్య (28), ఆమ్లా (27), ఏబీ డివిలియర్స్ (25), క్రిస్ గేల్ (25), కుమార సంగక్కర (25) కొనసాగుతున్నారు. టాప్-3లో ముగ్గురూ భారతీయులే ఉండటం విశేషం.