News February 5, 2025
డయల్ 100కు 4,056 కాల్స్: ఖమ్మం సీపీ

ఖమ్మం: సమాజంలో పెరిగిపోయిన నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల ధన, మాన ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాలైన డయల్ 100కు జనవరి నెలలో 4,056 కాల్స్ వచ్చాయని సీపీ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిపై 57 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, వీటిలో హత్యాయత్నం-1, మహిళలపై వేధింపులు-1, దొంగతనాలు-9, సాధారణ ఘాతాలు-14, యాక్సిడెంట్లు-11, అనుమానాస్పద మరణాలు-4, ఇతర కేసులు-17 ఉన్నాయన్నారు.
Similar News
News November 21, 2025
ఖమ్మం: ఇందిరమ్మ చీరల పంపిణీకి మంత్రి తుమ్మల ఆదేశం

ఖమ్మం జిల్లాలో 18ఏళ్లు నిండిన ప్రతి గ్రామీణ మహిళకు ఇందిరమ్మ చీరలను ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లోపు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకుంటే రూ.10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి ప్రకటించారు.

ఖమ్మంలో ఫుట్ పాత్ల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి అధికారులతో సమీక్షించారు. నగరంలో ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యలపై చర్చించారు. వైరా రోడ్డు, బైపాస్, ఇల్లందు రోడ్డు వంటి 8 ప్రధాన రోడ్లకు ఫుట్ పాత్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు.