News February 25, 2026
డయిల్ 100కు తక్షణమే స్పందించాలి: భద్రాద్రి ఎస్పీ

=బాధితుల నుంచి ‘డయిల్ 100’కు ఫోన్ రాగానే పోలీసులు తక్షణమే స్పందించి వారికి అండగా నిలవాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. బుధవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి కేసులోనూ ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్థులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.
Similar News
News April 14, 2026
గృహ ప్రవేశ సమయంలో గోవు ఎందుకు?

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇంటి నిర్మాణంలో తెలియక చేసిన దోషాలను తొలగించడానికి గోమాతను ఇంట్లోకి తీసుకువస్తారు. గోవు అంటే లక్ష్మీదేవి స్వరూపం. పవిత్రతకు నిలయంగా కూడా భావిస్తారు. గోమూత్రం, గోమయం పవిత్రమైనవి. గోవు ప్రవేశంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే గోవు పాలు, పెరుగు వంటివి వాడటం వలన శరీరానికి, మనసుకు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం.
News April 14, 2026
ఆదిలాబాద్: ఎండ దెబ్బకు ‘తల’ వంచని కాపరి

నింగి నుంచి నిప్పుల వర్షం కురుస్తుంటే.. తల దాచుకోవడానికి చెట్టు నీడ కూడా కరువవుతోంది. కానీ, ఈ పశువుల కాపరి మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఏకంగా హెల్మెట్‌నే రక్షణ కవచంగా మార్చుకున్నాడు. పశువులేమో తల దించుకుని నడుస్తుంటే, ఈ కాపరి మాత్రం హెల్మెట్ వేసి ‘మినీ స్పేస్ షిప్’ కమాండర్‌లా దర్జాగా వెళ్తున్నాడు. బుర్ర’ ఉన్నోడు ఏ ఎండకైనా గొడుగు పడతాడని స్థానికులు చమత్కరిస్తున్నారు. వినూత్నమేదైనా అది ప్రాణ రక్షణకే.
News April 14, 2026
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.


