News June 21, 2024
డయేరియా నియంత్రణకు చర్యలు: డీకే బాలాజీ
జిల్లాలో డయారియా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి ఆయన హాజరయ్యారు. వర్షాకాలం నేపథ్యంలో తాగునీరు కలుషితమై డయేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.
Similar News
News September 19, 2024
నేడు విజయవాడలో పవన్‌ను కలవనున్న బాలినేని
వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా గురువారం ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీకానున్నారు. ఈ మేరకు గురువారం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్‌తో చర్చలు అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.
News September 18, 2024
కృష్ణా: ఇసుక బుకింగ్‌పై సిబ్బందికి శిక్షణ
ఇసుక Online బుకింగ్ విధానంపై గ్రామ / వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ విధానం అమలు చేయనున్నదని, ఇందుకు సంబంధించి పోర్టల్‌ను రేపు ప్రారంభిస్తారన్నారు.
News September 18, 2024
విజయవాడ: మంత్రి నిమ్మలను కలిసిన పలువురు నేతలు
విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడును మాజీ ఎంపీ, లైలా గ్రూప్ ఛైర్మన్, గోకరాజు గంగరాజు, ఎస్ఎల్‌వీ గ్రూప్ ఛైర్మన్ శ్రీనివాసరాజు, తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడును వారు సత్కరించారు. అనంతరం బుడమేరు వరద కారణంగా కేసరపల్లిలో ముంపుకు గురైన ఎస్ఎల్‌వీ లైలా గ్రీస్ మెడోస్ కాలనీవాసులకు భవిష్యత్తులో తమ నివాసాలవైపు వరద నీరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.