News January 9, 2025
‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అందుకే రద్దు చేశాం: బాలకృష్ణ
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అనంతపురంలో ఈ రోజు జరగాల్సిన ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేశారు. ‘తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విషాధ సమయంలో ఈవెంట్ జరపడడం సముచితం కాదు. అందుకే రద్దు చేశాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది’ అని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ తెలిపారు.
Similar News
News January 10, 2025
పుట్టపర్తిలో వివాహిత ఆత్మహత్యాయత్నం
పుట్టపర్తిలోని చిత్రావతి నదిలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన నదిలో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని కుమ్మరపేటకు చెందిన నాగవేణిగా గుర్తించారు. భర్త బాలరాజు ఆటోతో జీవనం సాగిస్తున్నారు. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు.
News January 10, 2025
అనంతపురం జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం
అనంతపురం జిల్లాలో భారీ మొత్తంలో బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 12 మంది బంగారు వ్యాపారులు కేరళ నుంచి రైలులో వస్తుండగా.. సుంకం చెల్లించని దాదాపు 13 కేజీల బంగారాన్ని గుర్తించారు. పంచనామా నిమిత్తం తాడిపత్రికి వచ్చి కస్టమ్స్ కార్యాలయం నుంచి విజయవాడకు తరలించారు.
News January 10, 2025
సెంట్రల్ సిల్క్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతపురం ఎంపీ
బెంగళూరులోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన సెంట్రల్ సిల్క్ బోర్డు సమావేశంలో గురువారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు పరిశ్రమ అభివృద్ధికి అనేక కీలక అంశాలను ఆయన ప్రస్తావించి, వాటిపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, రైతులకు ఇన్సెంటివ్ అందించాలని, రీలింగ్ యూనిట్ మెషిన్లకు జీఎస్టీ రద్దు చేయాలని కోరారు.