News January 27, 2025
డాక్టర్ జీ.మమతకు ప్రశంసా పత్రం

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనంత జిల్లా పరిపాలన విభాగం జిల్లా అభివృద్ధికి విశేష సేవలు అందించిన వ్యక్తులను సత్కరించింది. జేఎన్‌టీయూఏ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ జాతీయ సేవా పథకం అధికారి డాక్టర్ జి.మమత, జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం అందించిన సేవలకు గుర్తింపుగా మెరిటోరియస్ డిపార్ట్మెంట్ సర్వీస్ విభాగంలో సత్కారాన్ని అందుకున్నారు.
Similar News
News November 26, 2025
అనంతపురం: ఆనంద్‌ది పరువు హత్య..?

ప్రేమ పేరుతో రప్పించి యనకళ్లు గ్రామానికి చెందిన వాల్మీకి బోయ ఆనంద్‌ను బ్రహ్మాసముద్రం మండలంలో హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బుధవారం ఏపీ వాల్మీకి బోయ సంఘం నాయకులు అక్కులప్ప, మాధవయ్య తదితరులు ఆనంద్ కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐ హరినాథ్‌కు వినతి పత్రం అందించారు.
News November 26, 2025
జిల్లాకు రాష్ట్రస్థాయి ఓవరాల్ ఛాంపియన్ షిప్

వినుకొండలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ గేమ్స్‌లో బాలికల అండర్-17 అథ్లెట్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అనంతపురం జిల్లా గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను పొందారు. ఇందులో పాల్గొన్న వర్షిత, ఇంద్ర లేఖ, మౌనిక తదితర 14 మంది బాలికలను ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అభినందించారు. కార్యక్రమంలో గేమ్స్ అబ్జర్వర్ ప్రసాద్ రెడ్డి, ప్రవీణ, అనంతపురం జిల్లా మేనేజర్ పీడీ చల్లా ఓబులేసు, కోచ్ నారాయణ, చలపతిలు పాల్గొన్నారు.