News September 7, 2024
డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 46 శాతం పీజీ ప్రవేశాలు
ఎచ్చెర్ల డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను పీజీ ప్రవేశాలు 46 శాతం నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ పీజీ సెట్-2024 అలాట్ మెంట్‌లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అంబేడ్కర్ యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో సగానికి పైగా సీట్లు మిగిలిపోయాయి. వివిధ కోర్సుల్లో మొత్తం 562 సీట్లకు గాను 259 సీట్లకు ప్రవేశాలు జరిగాయి. విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంది.
Similar News
News October 13, 2024
SKLM: మద్యం సీసా గుచ్చుకొని యువకుడి మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. మెళియాపుట్టి మండలం మురికింటిభద్ర గ్రామానికి చెందిన సవర సురేశ్(28) మద్యం తాగి బైకుపై వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడ్డాడు. అప్పటికే మద్యం బాటిళ్లను కడుపులో ఉంచుకొని డ్రైవ్ చేస్తుండటంతో.. అవి పగిలిపోయాయి. సీసా పగిలి కడుపులో గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడటంతో సురేశ్ మృతి చెందాడు. ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 12, 2024
శ్రీకాకుళం: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?
దసరా పండుగ అనగానే పల్లె గుర్తుకొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. పల్లెల్లో తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
శ్రీకాకుళం జిల్లాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
జిల్లాలోని KGBVల్లో ఖాళీగా ఉన్న 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు కనీసం ఏడో తరగతి పాస్ అయి ఉండాలి. మిగతా పోస్టులకు నిర్దిష్ట విద్యార్హత లేదు. వయస్సు 21 నుంచి 42 వరకు కాగా, కుల ప్రాతిపదికన(47), వికలాంగులకు(52) వయస్సు పొడిగింపు ఉంది. అర్హత గలవారు ఈ నెల 15లోగా ఆయా మండలాల MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాలి.