News July 5, 2024
డా.సుధాకర్‌పై పోక్సో కేసు నమోదు

బాలికపై లైంగిక వేధింపుల కేసులో కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. నిందితుడిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 376తో పాటు బాధితురాలు మైనర్ కావడంతో పోక్సో చట్టం సెక్షన్ 6 రెడ్‌విత్ 5(ఎల్) కింద కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుధాకర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జిల్లా కారాగారానికి తరలించారు.
Similar News
News September 13, 2025
నకిలీ ఏపీకే ఫైళ్ల జోలికి వెళ్లొద్దు: కర్నూలు ఎస్పీ

జిల్లా ప్రజలు నకిలీ ఏపీకే ఫైళ్లకు దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్‌లో ఆర్టీవో ఛలాన్, ఎస్బీఐ రివార్డ్స్, పీఎం కిసాన్ పేర్లతో వచ్చే నకిలీ ఫైళ్లను క్లిక్ చేయవద్దని సూచించారు. వీటిని ఇన్‌స్టాల్ చేస్తే బ్యాంక్ ఖాతా వివరాలు హ్యాకర్లకు చేరడంతో పాటు, వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుందని పేర్కొన్నారు.
News September 12, 2025
‘దసరా బిగ్ సేల్’ ఆఫర్లతో జాగ్రత్త: కర్నూలు ఎస్పీ

దసరా వేళ బిగ్ సేల్ ఆఫర్లతో వచ్చే సోషల్ మీడియా ప్రకటనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో సైబర్ నేరగాళ్లు తక్కువ ధరల్లో వస్తువులు అంటూ లింకులు పంపిస్తున్నారన్నారు. వాటిని క్లిక్ చేస్తే ద్విచక్ర వాహనాలు, కార్లు గెలుస్తారని మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు.
News September 12, 2025
కర్నూలు కలెక్టర్‌గా సిరి.. ఉద్యోగ ప్రస్థానం ఇదే..!

కర్నూలు కలెక్టర్‌గా సిరి నియమితులయ్యారు. శ్రీకాకుళం(D) టెక్కలికి చెందిన ఈమె విశాఖలో MBBS చదివారు. గ్రూప్-1 పరీక్షలు రాసి 2007లో పాలకొండ RDOగా బాధ్యతలు తీసుకున్నారు. హైదరాబాద్‌లో విజిలెన్స్ విభాగం, తూ.గో జిల్లా SC కార్పొరేషన్ ED, విశాఖ జిల్లా పర్యాటక అధికారి, విశాఖ జేసీ-2, ప్రకాశం జిల్లా జేసీ-2, అనంత జిల్లా జేసీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు.