News July 29, 2024

డిండి జలాశయంలో తగ్గిన నీటిమట్టం

image

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో డిండి జలాశయంలో నీటిమట్టం తగ్గింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 20.5 అడుగులు మాత్రమే నిల్వ ఉంది. జూన్ 28న జలాశయంలో 26 అడుగులు నీరు నిల్వ ఉండగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. వర్షాలు లేక ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి నీరు చేరకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News February 23, 2026

నల్గొండ: మైనారిటీల ఆర్థికాభివృద్ధికి గోల్డెన్ ఛాన్స్

image

మైనారిటీల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రెండు కీలక పథకాల కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లాలో ఆసక్తి గలవారు మార్చి 1 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజయేందర్ రెడ్డి తెలిపారు. వెబ్‌సైట్ :http://tsobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News February 23, 2026

సీఎం కప్ హాకీ రాష్ట్రస్థాయి విజేతగా నల్గొండ జట్టు

image

హైదరాబాద్‌ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో నల్గొండ బాలుర జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో నిజామాబాద్ జట్టుపై 2-0 తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా నిలిచింది. ఈ చరిత్రాత్మక విజయం పట్ల జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు.

News February 23, 2026

నల్గొండ: గణనీయంగా తగ్గిన మాతా శిశు మరణాలు

image

రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు మాతా శిశువుల ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో గత ఎనిమిదేళ్లుగా జిల్లాలో మరణాల రేటు గణనీయంగా తగ్గుతోంది. 2018-19లో 335 శిశువులు, 14 మంది తల్లులు మరణించగా, 2025 నాటికి ఆ సంఖ్య 72 శిశువులకు, 9 మంది తల్లులకు పడిపోయింది.