News March 29, 2024
డిగ్రీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మహాత్మా జ్యోతి బాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఖమ్మంలో గర్ల్స్ డిగ్రీ కాలేజీ, కొత్తగూడెంలో బాయ్స్ డిగ్రీ కాలేజీ ఉండగా, ఆర్‌డీసీ సెట్–2024 ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు ఖమ్మం కాలేజీ ప్రిన్సిపాల్ డా.వీ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఏప్రిల్ 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News March 11, 2026
KMM: నీరా కేఫ్ లీజుకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ‘నీరా కేఫ్’ భవనాన్ని లీజుకు ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి తెలిపారు. కల్లు గీత కార్మిక సహకార సంఘాల్లో నమోదై, నీరా సేకరణ అనుమతి ఉన్నవారు ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గలవారు వివరాల కోసం www.tgttcfc.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. గౌడ వృత్తిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
News March 11, 2026
గత ‘ఇందిరమ్మ’ బిల్లుల గోల్‌మాల్.. విచారణకు ఆదేశం

వైఎస్ఆర్ హయాంలో కొందరు నేతలు తమకు తెలియకుండానే తమ పేర్లపై ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు డ్రా చేశారని వేంసూరు బాధితులు గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్నారు. ఈ పాత రికార్డుల వల్ల ఇప్పుడు కొత్త ఇళ్లకు తాము అనర్హులమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి కేసులు వేలల్లో ఉండటంతో అధికారులు విచారణ చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాస్ నాయక్ హామీ ఇచ్చారు.
News March 11, 2026
ఖమ్మంలో రేపు జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల కోసం మార్చి 12న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని అర్క రెనాల్ట్ షోరూంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. ఫీల్డ్ సేల్స్ కన్సల్టెంట్స్, సేల్స్ టీం లీడర్స్, యూజ్డ్ కార్ ఎవల్యూటర్స్ పోస్టులకు మొత్తం 35 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, మెకానికల్ డిప్లొమా, బీటెక్ మెకానికల్ అర్హత కలిగిన 22-33 ఏళ్ల యువత సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.


