News March 17, 2025
డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ అరెస్ట్

కదిరిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటపతిని అరెస్ట్ చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వెంకటపతికి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్ట్లో హాజరు పరిచినట్లు సీఐ పేర్కొన్నారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ వెల్లడించారు. హోలీ సందర్భంగా ప్రిన్సిపల్ వెంకటపతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సీఐ తెలిపారు.
Similar News
News October 29, 2025
శేషాచలం కనుమల్లో కనుగొన్న గెక్కో జాతి బల్లి

ఏపీ తూర్పు కనుమల్లో కొత్తగా ఒక గెక్కో జాతి గుర్తించారు. తిరుమల వెంకటాద్రి పర్వత ప్రాంతంలోని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్లో ZSI శాస్త్రవేత్తల బృందం ఈ చిన్న బల్లిని కనుగొంది. Hemiphyllodactylus venkattadri అనే పేరుతో నమోదు చేసిన ఈ జాతి, జన్యు పరీక్షల్లో ఇప్పటివరకు తెలిసిన ఇతర సన్నని గెక్కో జాతుల కంటే భిన్నమని తేలింది. ఇది ఏపీలో కనుగొనబడిన రెండో హెమిఫిల్లోడాక్టిలస్ జాతి.
News October 29, 2025
వనపర్తి: భారీ వర్షాలు… ఇంటర్ కళాశాలలకు సెలవు

భారీ వర్షాల కారణంగా వనపర్తి జిల్లాలోని అన్ని ఇంటర్ కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. కళాశాలలకు వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున ముందస్తుగా ఈ సెలవు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపల్లకు సమాచారం ఇచ్చారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఆయన సూచించారు.
News October 29, 2025
WGL: మొంథా తుఫాన్ ప్రభావం.. వర్షపాతం వివరాలు

మొంథా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఉదయం 8:30 గంటల నుండి 10:00 గంటల వరకు అత్యధిక వర్షపాతం రాయపర్తి మండలంలో 55.8 mm, వర్దన్నపేటలో 54.5mm నమోదైంది. పర్వతగిరి మండలంలో 42.8 mm, నెక్కొండలో 34.6 mm, ఖానాపూర్లో 34.0, చెన్నారావుపేటలో 19.5mm, సంగెంలో 12.3 mm, నర్సంపేటలో 9.0mm నమోదయ్యాయి.


