News April 27, 2024

డిచ్పల్లిలో చిన్నారిపై వీధి కుక్క దాడి

image

డిచ్పల్లి మండలం ఘన్పూర్‌లో శనివారం ఉదయం ఓ చిన్నారి రోడ్డుపై ఆడుకుంటుండగా వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో కిందపడిన చిన్నారి అరవడంతో గమనించిన తల్లి కుక్కను తరిమేసింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. గ్రామంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని, పంచాయతీ సిబ్బంది స్పందించి వాటిని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News February 28, 2026

నవీపేట్‌: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

image

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

image

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.