News May 19, 2024

డిచ్‌పల్లి: రేపటి నుంచి హౌజ్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ

image

SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజాంబాద్ గ్రామీణ ప్రాంత యువకులకు హౌజ్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. శిక్షణ పొందేందుకు 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలని, ఈనెల 20 నుంచి 30 రోజులపాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. శిక్షణ పొందే వారికి ఉచిత భోజన వసతి కల్పిస్తామని వెల్లడించారు.

Similar News

News December 14, 2024

కామారెడ్డి: గ్రూప్‌-2 సన్నాహక సమావేశంలో అడిషనల్ కలెక్టర్

image

కామారెడ్డి పట్టణ కేంద్రంలో రేపు జరగనున్న గ్రూప్-2 పరీక్షా సన్నాహక సమావేశంలో  అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. స్థానిక సాందీపని డిగ్రీ కళాశాలలో జరుగుతున్న సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సూచనలు తప్పక పాటించాలని అన్నారు. అభ్యర్థులతో ఎవ్వరూ మాట్లాడకూడదని సూచించారు. ఈ సమావేశంలో రెండు సెంటర్ల ఇన్విజిలేటర్‌లు పాల్గొన్నారు.

News December 14, 2024

కామారెడ్డి: దొంగ నోట్ల ముఠా అరెస్ట్

image

దొంగ నోట్లు తయారు చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా SP సింధుశర్మ తెలిపారు. హైదరాబాదులో దొంగ నోట్లను ముద్రిస్తూ బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాల్లో చలామణికి యాత్నిస్తుండగా పట్టుకున్నట్లు SP చెప్పారు. వారి నుంచి రూ.56.90 లక్షల విలువ గల నకిలీ 500 నోట్లను, ప్రింటర్, 6 సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

News December 14, 2024

నిజామాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. శుక్రవారం జుక్కల్ 9.4 డిగ్రీలు, మెండోరా 10.6, కోటగిరి 10.6, బిచ్కుంద 10.7, పోతంగల్ 10.8, మేనూర్ 11.1 , గాంధారి 11.2, మాచారెడ్డి 11.4, బీర్కూర్ 11.5, పాల్వంచ 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.