News June 15, 2024

డిచ్‌పల్లి: సిగరెట్ కొని.. బంగారు గొలుసు లాక్కెళ్లి

image

ఓ మహిళ మెడలోంచి 3 తులాల బంగారు పుస్తెల తాడును లాకెళ్లిన ఘటన డిచ్పల్లి PS పరిధిలో శుక్రవారం జరిగింది. SI మహేష్ వివరాలిలా.. మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో మొగుళ్ల వినోద కిరణా షాప్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి సిగరెట్ తీసుకొని రూ.50 ఇచ్చారు. తిరిగి డబ్బులు ఇచ్చే క్రమంలో మహిళ మెడలోంచి పుస్తెలతాడును లాక్కెళ్లారు. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 28, 2025

CM రేవంత్, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు: MPఅర్వింద్

image

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని MP అర్వింద్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..CM రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు కాబట్టే ఆమె రాజీనామా ఆమోదం పొందడం లేదని ఆరోపించారు. స్వయంగా కవితనే రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్ధ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు.

News October 28, 2025

NZB: అయ్యో.. రూ. 3 లక్షలు పోయాయ్..!

image

ఎన్నో ఆశలు, మరెన్నో ఉత్కంఠల మధ్య నిజామాబాద్ జిల్లాలో వైన్ షాపుల కేటాయింపునకు సంబంధించిన లక్కీ డ్రా సోమవారం పూర్తయింది. డ్రా ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించారు. విజేతలుగా నిలిచిన అదృష్టవంతుల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. లక్కీ డ్రాలో తమ పేర్లు రాని వారి మొహాలు చిన్నబోయాయి. డబ్బులు పోయిన బాధతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకుంటే డ్రాలో పేరు రాలేదని నైరాశ్యంలో మునిగారు.

News October 28, 2025

NZB: DCC పీఠం దక్కేదెవరికో..?

image

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ భరితంగా మారింది. ఈ పదవి కోసం 17 మంది అధ్యక్ష పీఠం కోసం పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో NZBకు చెందిన నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, జావేద్ అక్రమ్, బాడ్సి శేఖర్ గౌడ్ తదితరులతో పాటు ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల వారు దరఖాస్తు చేశారు. ఇందులో వారికి పదవి అప్పగిస్తారనేది ఉత్కంఠ భరితంగా మారింది.